చొరబాటుదారుల్ని రక్షించేందుకే టీఎంసీ సీఏఏని వ్యతిరేకిస్తుంది- మోడీ

by Dishanational6 |
చొరబాటుదారుల్ని రక్షించేందుకే టీఎంసీ సీఏఏని వ్యతిరేకిస్తుంది- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ చొరబాటుదారులను రక్షిస్తోందని మండిపడ్డారు ప్రధాని మోడీ. అందుకోసమే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే సీఏఏను వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. బెంగాల్ లోని బాలూర్ ఘాట్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు మోడీ. గూండాలు, చొరబాటు దారులకు పశ్చిమ బెంగాల్ ను టీఎంసీ లీజుకు ఇచ్చిందని ఫైర్ అయ్యారు.

బెంగాల్ లో శ్రీరామనవమి వేడుకలను వ్యతిరేకిస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హౌరాలో వీహెచ్ పీ ఊరేగింపును అనుమతిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పిచ్చింది. దాన్ని ప్రస్తావిస్తూ సత్యం గెలిచిందని అన్నారు. సందేశ్ ఖాలీలోని మహిళలపై జరిగన దారుణాన్నిచూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందన్నారు. దోషులను రక్షించేందుకు టీఎంసీ ప్రభుత్వం ఎలా ప్రయత్నంచిందో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు.

బెంగాల్ లో అవినీతి, నేరాలు రాజ్యమేలుతున్నాయని విరుచుకుపడ్డారు. ఈ అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించినప్పుడు కేంద్ర ఏజెన్సీలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. బెంగాల్ ప్రభుత్వం చొరబాటుదారుల్ని రక్షిస్తుంది కానీ.. శరణార్థులకు పౌరసత్వం అందించే సీఏఏని వ్యతిరేకిస్తుంనది విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అబద్ధాలు చెప్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌లో దాదాపు ప్రతిరోజూ బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'మోడీ హామీ'ని ప్రవేశపెట్టినప్పటి నుండి బెంగాల్ అధికార పార్టీ కలవరపడిందని అన్నారు. బెంగాల్ ప్రజలకు కేంద్ర పథకాల ప్రయోజనాలు ఇచ్చేందుకు నిరాకరించారని మండిపడ్డారు అయితే, ఆ పథకాల సామర్థ్యాన్ని గ్రహించారని.. అదే భయం ఇప్పుడు టీఎంసీకి పట్టుకుందన్నారు. టీఎంసీ వ్యతిరేకించినా.. వచ్చే ఐదేళ్లలో బెంగాల్ ను అభివృద్ధి చేసేందుకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు.


Next Story

Most Viewed