దేశంలోని 9 స్థానాల్లో ఉత్కంఠభరిత పోరు.. విశేషాలివీ

by Dishanational4 |
దేశంలోని 9 స్థానాల్లో ఉత్కంఠభరిత పోరు.. విశేషాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల మహా క్రతువులో భాగంగా ఓట్ల పండుగ జరగబోయే తేదీలు మరెంతో దూరంలో లేవు. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ ఘట్టం జరిగే స్థానాల్లో తొమ్మిది చోట్ల రసవత్తరమైన పోటీ నెలకొంది. ఆ స్థానాలలో నెలకొన్న హోరాహోరీ పోటీపై ఓ పరిశీలన..

చురులో గెలిచేదెవరు ?

రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో దేవేంద్ర ఝఝరియా (బీజేపీ), రాహుల్ కస్వాన్ (కాంగ్రెస్) ఉన్నారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోట లాంటిది. బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఝఝరియా గతంలో క్రీడాకారుడిగా మంచిపేరు సంపాదించారు. ఆయన రెండుసార్లు పారాలింపిక్‌లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎంపీ రాహుల్ కస్వాన్ ఇటీవలే కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. గతంలో చురు నుంచి ఈయన వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. జాట్ వర్గానికి చెందిన రాహుల్ కస్వాన్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

చంద్ర శేఖర్ ఆజాద్.. భవితవ్యం ఏమిటి ?

ఉత్తరప్రదేశ్‌లోని నాగినా లోక్ సభ స్థానంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థులలో చంద్ర శేఖర్ ఆజాద్ (ఆజాద్ సమాజ్ పార్టీ), సురేంద్ర పాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్ కుమార్ (ఎస్పీ), ఓం కుమార్ (బీజేపీ) ఉన్నారు. ఈ స్థానంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఆజాద్ ఒక ప్రముఖ దళిత నాయకుడు. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు. నగీనా జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు 20 శాతం మంది, ముస్లింలు 43 శాతం మంది ఉన్నారు.చంద్ర శేఖర్ ఆజాద్‌కు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య కూడా మద్దతు ఇస్తున్నారు.

గొగోయ్ వర్సెస్ గొగోయ్

అసోంలోని జోర్హాట్‌ లోక్‌సభ స్థానంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థుల్లో గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), తోపాన్ కుమార్ గొగోయ్ (బీజేపీ) ఉన్నారు. వాస్తవానికి ఈ సీటు కాంగ్రెస్ కంచుకోట. మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడే గౌరవ్ గొగోయ్. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ నేత టోపోన్ కుమార్ గొగోయ్ గెలిచారు.

కోయంబత్తూరులో..

తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగబోతోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థులలో గణపతి పి. రాజ్‌కుమార్ (డీఎంకే), కె అన్నామలై (బీజేపీ), సింగై జి రామచంద్రన్ (ఏఐఏడీఎంకే) ఉన్నారు. కె అన్నామలై ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రధాని మోడీకి కూడా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్నామలై ఉన్నారు. ఇక్కడి టెక్స్‌టైల్ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, ప్రత్యేకించి తమిళేతరులు బీజేపీకి అనుకూలంగా ఉంటారనే అంచనాలు ఉన్నాయి.

మరో 5 స్థానాల్లో..

* కేరళలోని వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులలో అన్నీ రాజా (సీపీఐ), కే సురేంద్రన్ (బీజేపీ), రాహుల్ గాంధీ (కాంగ్రెస్) ఉన్నారు.

* బిహార్‌లోని పూర్ణియ స్థానంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ముఖ్య అభ్యర్థులలో పప్పు యాదవ్ (స్వతంత్ర), బీమా భారతి (ఆర్‌జేడీ), సంతోష్ కుమార్ కుష్వాహా జేడీ(యూ) ఉన్నారు.

* కేరళలోని తిరువనంతపురం స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న

ముఖ్య అభ్యర్థులలో శశి థరూర్ (కాంగ్రెస్), రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ), పన్నయన్ రవీంద్రన్ (సీపీఐ) ఉన్నారు.

* రాజస్థాన్‌లోని బార్మర్-జైసల్మేర్ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీచేస్తున్న

ముఖ్య అభ్యర్థులలో కైలాష్ చౌదరి (బీజేపీ), ఉమేదా రామ్ బెనివాల్ (కాంగ్రెస్), రవీంద్ర సింగ్ భాటి (స్వతంత్ర) ఉన్నారు.

* కేరళలోని త్రిసూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న

ప్రధాన అభ్యర్థులలో సురేష్ గోపి (బీజేపీ), కె మురళీధరన్ (కాంగ్రెస్), విఎస్ సునీల్ కుమార్ (సిపిఐ) ఉన్నారు.


Next Story

Most Viewed