‘పార్లమెంట్ ప్రారంభోత్సవం’ పిల్ కొట్టివేత

by Disha Web Desk 2 |
‘పార్లమెంట్ ప్రారంభోత్సవం’ పిల్ కొట్టివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. లోక్‌సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సీఆర్ జయ సుఖిన్ అనే న్యాయవాది గురువారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరహింహతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము అని ధర్మాసనం పేర్కొంది. మీకు కోర్టు ఖర్చులు విధించనందుకు సంతోషించండి అంటూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Next Story

Most Viewed