బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు

by Dishafeatures2 |
బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పార్టీ సిబ్బంది తొలగించారు. అదే విధంగా బీఎస్పీ ఫౌండర్ కాన్షీరాం, బీఎస్పీ చీఫ్ మాయావతి విగ్రహాలను కూడా తొలగించారు. అయితే ఈ తొలగింపుకు గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. అయితే రానున్న ఎన్నికల కోసమే బీఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా వచ్చే ఏడాది మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే బీఎస్పీ విగ్రహాలను తొలగించిందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ క్రియాశీల పాత్ర పోషించేలా మాయావతి చర్యలు తీసుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఆమె మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన దళితులు, ఎస్టీలు, ఓబీసీలను తిరిగి పార్టీ వైపు ఆకర్షించేలా బీఎస్పీ వ్యూహాలు సిద్దం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed