రాబోయే 3 నెలలు ఆ కార్యక్రమం బంద్.. ఎంపీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ సంచలన ప్రకటన

by Disha Web Desk 13 |
రాబోయే 3 నెలలు ఆ కార్యక్రమం బంద్.. ఎంపీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో:దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ పరంగా వివిధ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీడు పెంచారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'మన్ కీ బాత్' ప్రసారాలు రాబోయే 3 నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ప్రసంగించారు.

రెండో టర్మ్ లో చివరి ప్రసంగం:

2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక అదే ఏడాది అక్టోబర్ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై ప్రజలను ఉద్దేశించి తన మనసులోని మాటలను మోడీ పంచుకుంటూ వస్తున్నారు. ఇవాళ ప్రసారం అయిన కార్యక్రమం 110వ ఎపిసోడ్ కాగా ప్రధానిగా మోడీ రెండో టర్మ్ లో ఇదే చివరి మన్ కీ బాత్ ప్రసంగం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

కొత్త ఓటర్లకు పిలుపు:

ఇవాళ్టి ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ - దేశ్ కే లియే’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటి సారి ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తుల నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడంలో సోషల్ మీడియా చాలా సహాయపడుతోందని భారతదేశంలోని యువకులు కంటెంట్ క్రియేషన్ రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. వారి ప్రతిభను గౌరవించేందుకు, నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రారంభించామని చెప్పారు. మిత్రులారా మార్చి 8వ తేదీన మనం 'మహిళా దినోత్సవం' జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజు. దేశ అభివృద్ధి ప్రయాణంలో స్త్రీ శక్తి యొక్క సహకారానికి సెల్యూట్ చేయడానికి ఒక అవకాశం. మహిళలకు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మహాకవి భారతియార్ అన్నారు. నేడు భారతదేశ మహిళా శక్తి అన్ని రంగాలలో పురోగతి యొక్క కొత్త శిఖరాలను తాకుతోంది' అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన, కృషి చేస్తున్న వారితో ప్రధాని ఈ సందర్భంగా సంభాషించారు.

Next Story

Most Viewed