'ది కాశ్మీర్ ఫైల్స్' ఎఫెక్ట్: కాశ్మీర్ ముస్లీమ్‌ల‌కు ఢిల్లీ హోట‌ళ్లు షాక్‌!

by Disha Web Desk 20 |
ది కాశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్: కాశ్మీర్ ముస్లీమ్‌ల‌కు ఢిల్లీ హోట‌ళ్లు షాక్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల నుండి సినిమాని విడిదీసి చూడ‌లేము. వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నార‌ని తెలిసినా ప్రేక్ష‌కులు మాత్రం సినిమావాళ్ల‌ను దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు చెప్పిందే అఖండ స‌త్య‌మ‌న్న‌ట్లు పాటిస్తారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల విడుద‌లైన వివాద‌స్ప‌ద సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్' ఇండియాలో తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాను చూసిన హిందువులు కొంద‌రు థియేట‌ర్ల‌లోనే 'ధ‌ర్మ‌సంస్థాప‌న' ప్ర‌సంగాలు చేస్తూ, వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా భార‌త రాజ‌ధాని ఢిల్లీ మ‌హాన‌గ‌రంలో కాశ్మీర్‌ ముస్లింల‌పై మ‌రింత వివ‌క్ష పెరిగింది. హోటల్ అగ్రిగేషన్ సంస్థ ఓయో రూమ్స్ క్రింద ఉన్న ఓ ఢిల్లీ హోటల్, ఒక కాశ్మీరీ వ్యక్తి బుక్ చేసుకున్న రూమ్‌ని ఇవ్వ‌మంటూ మొఖం మీద చెప్పేసింది.

ఆధార్ కార్డ్‌తో సహా, గుర్తింపు ఐడీ ప్రూఫ్‌లను చూపించిన తర్వాత కూడా కాశ్మీరీ గుర్తింపు ఉంద‌ని చెప్పి ముందే బుక్ చేసుకున్న గ‌దికి చెక్-ఇన్ చేయనివ్వలేదు. ఎందుకుని అడిగితే.. హోట‌ల్ రిసెప్షన్‌లో ఉన్న మ‌హిళ తన య‌జ‌మానికి ఫోన్ చేసి, ఆ త‌ర్వాత ఢిల్లీ పోలీసులే కాశ్మీరీల‌కు రూమ్ ఇవ్వొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారంటూ అబ‌ద్దం చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధికార ప్రతినిధి నాసిర్‌ ఖుహమీ ఈ కేసును త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులు వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని హోటళ్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి త‌ప్పిదాలు చేస్తే, జరిమానా విధిస్తామ‌ని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇక ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఓయో రూమ్స్ యాజ‌మాన్యం స‌ద‌రు ఢిల్లీ హోటల్‌ను త‌మ ప్లాట్‌ఫారమ్‌పై నుండి తొలగించింది. మా గదులు, మా హృదయాలు ఎల్లప్పుడూ అందరికీ తెరిచి ఉంటాయంటా వివ‌ర‌ణ ఇచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed