సీఎం మాట్లాడుతుండగా వేదికపైకి బిడ్డను విసిరేసిన తండ్రి

by Disha Web Desk 6 |
సీఎం మాట్లాడుతుండగా వేదికపైకి బిడ్డను విసిరేసిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ఓ తండ్రి ఏడాది వయసున్న కొడుకు వేదికపైకి విసిరేసిన ఘటన చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ముకేష్ పటేల్, నేహా అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇటీవల ఓ కొడుకు జన్మించాడు. అయితే ఈ బాలుడికి గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అప్పటి నుంచి ముకేశ్, నేహా వైద్య ఖర్చులు పెట్టేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కానీ, కొడుకు ఆరోగ్యం బాగుండాలని రూ. 4 లక్షల వరకు చికిత్సకు ఖర్చు చేశారు. అయినా బాలుడి ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో చిన్నారిని అతని తల్లిదండ్రులు ఇటీవల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు రూ 3.50 లక్షల వరకు అవుతుందని తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులకు డబ్బు ఎలా సమకూర్చాలో అర్థంకాక సతమతమయ్యారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సాగర్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి ముకేశ్, నేహా కూడా తమ బిడ్డను తీసుకుని వెళ్లి సీఎంకు తమ గోడును తెలపాలని అనుకున్నారు. ఎక్కువ మంది ఉండడంతో సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సీఎం దృష్టి తమపై పడాలని ముకేశ్ ఏడాది వయసున్న కొడుకును ఒక్కసారిగా వేదికపైకి విసిరేశాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది బాబును కాపాడి తల్లికి అప్పగించారు. ఆ తర్వాత సీఎం అసలు విషయం తెలుసుకుని ఆ బాలుడి వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed