జార్ఖండ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత: సొరేన్ ఇంటికి చేరుకున్న ఈడీ

by Dishanational2 |
జార్ఖండ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత: సొరేన్ ఇంటికి చేరుకున్న ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండ రింగ్ కేసులో విచారణకు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రాంచీలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. జనవరి 16, 20 మధ్య ఈ అంశంపై విచారణకు అందుబాటులో ఉండాలని ఈడీ సీఎంను కోరింది. అయితే జనవరి 20 న తన నివాసంలోనే స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయాలని సొరేన్ ఈడీకి తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ ఆఫీసర్స్ సీఎం ఇంటికి శనివారం వచ్చారు. అంతకుముందు ఈడీ ఇన్వెస్టిగేషన్‌ను నిరసిస్తూ గిరిజన జేఎంఎం, గిరిజన నాయకులు ఆందోళన చేపట్టారు. రాజ్ భవన్ వైపుగా ర్యాలీ నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో శాంతి భద్రతలను కాపాడేందుకు సీఎం సొరేన్ నివాసం చుట్టూ 1000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. కాగా, రాష్ట్ర రాజధాని రాంచీలో అక్రమ మైనింగ్, భూ కుంభకోణం - రెండు ప్రధాన కేసులను ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం భూ కుంభకోణం కేసుకు సంబంధించిన ఆరోపణలపై విచారణకు సంబంధించి సొరేన్‌ కు ఈడీ ఏడు సార్లు సమన్లు జారీ చేసింది.


Next Story

Most Viewed