భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్‌.. కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు

by Dishanational1 |
భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్‌.. కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ నటి, మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న కంగనా రనౌత్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా రనౌత్.. మనకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడి వెళ్లారు? అన్నారు. దేశం కోసమే పోరాడిన ఆయనను దేశంలో అడుగుపెట్టనివ్వలేదన్నారు. అయితే, కంగనా వ్యాఖ్యల్లో పొరపాటును గమనించిన ఇంటర్వ్యూ చేస్తున్న న్యూస్ యాంకర్ సరిదిద్దారు. దాంతో ఆయన చేసిన త్యాగానికి బోస్ భారత మొదటి ప్రధాని అయ్యుండాలన్నారు. కానీ, కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలకు గురయ్యాయి. ప్రతిపక్ష నేతలు ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలను తేలిగ్గా తీసుకోకూడదని, సరైన అవగాహన లేకుండా మాట్లాడటం రాజకీయ నేతలకు అలవాటుగా మారిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌, ప్రస్తుత ఆప్ రాజ్యసభ ఎంపీగా ఉన్న మలివాల్ స్పందిస్తూ.. విద్యావంతులు, తెలివైన అభ్యర్థులకు ఓటు వేయండి' అని ప్రజలనుద్దేశించి అన్నారు. కాగా, కంగనా రనౌత్ గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ మాటలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. కంగనాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed