వరల్డ్ వార్-2లో ఇండియా వీరుడు.. ‘సుబేదార్ థాన్సేయా’ ఇక లేరు

by Dishanational4 |
వరల్డ్ వార్-2లో ఇండియా వీరుడు.. ‘సుబేదార్ థాన్సేయా’ ఇక లేరు
X

దిశ, నేషనల్ బ్యూరో : రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఆ సమయానికి మన దేశానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. బ్రిటీష్ పాలనే ఉండటంతో.. అనివార్య పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షానే భారత్ నిలవాల్సి వచ్చింది. బ్రిటీష్ సేనలతో కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఎంతోమంది భారతీయుల్లో ఒకరు సుబేదార్ థాన్సేయా. మిజోరంకు చెందిన థాన్సేయా 102 ఏళ్ల వయస్సులో సోమవారం తుదిశ్వాస విడిచారు. భారత ఆర్మీ చరిత్రలో ఆయనొక విజయ చిహ్నంగా నిలిచిపోతారని సీనియర్‌ ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుబేదార్ థాన్సేయా పదవీ విరమణ తర్వాత కూడా దేశం పట్ల అమితమైన అంకిత భావాన్ని ప్రదర్శించారు. తన అనుభవాలను అందరికీ తెలియజేయడంతో పాటు విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. యువ తరంలో దేశభక్తిని పెంపొందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.

Next Story

Most Viewed