అటువంటి వార్తలకు దూరంగా ఉండండి: జర్నలిస్టులకు మాజీ రాష్ట్రపతి సూచన

by Dishanational2 |
అటువంటి వార్తలకు దూరంగా ఉండండి: జర్నలిస్టులకు మాజీ రాష్ట్రపతి సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. టీఆర్‌పీ రేటింగ్ కోసం వివాదాస్పద వార్తలను ప్రసారం చేయొద్దని కోరారు. ఇది పాత్రికేయ వృత్తికి ప్రమాదకరమని సూచించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ 55వ స్నాతకోత్సవంలో కోవింద్ ప్రసంగించారు. పౌరులకు సరైన వార్తలు, సమాచారం అందేలా చూడడమే జర్నలిస్టుల కర్తవ్యమన్నారు. ‘సాంకేతికలో అనేక మార్పులు వస్తున్నప్పుడు మీరు జర్నలిజంలోకి అడుగుపెడుతున్నారు. ప్రతి మార్పు అనేక అవకాశాలు, సవాళ్లతో కూడుకుని ఉంటుంది. కాబట్టి కొత్త టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త వహించాలి’ అని విద్యార్థులకు సూచించారు. పాత్రికేయ విలువను కాపాడాలని హితవు పలికారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌కు సర్టిఫికెట్లు అందజేశారు.

Next Story

Most Viewed