తమిళ మత్స్యకారులపై శ్రీలంక దాడులు: ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ

by Dishanational2 |
తమిళ మత్స్యకారులపై శ్రీలంక దాడులు: ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అనేక మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు మత్య్సకారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. శ్రీలంక సముద్ర జలాల్లో ఆ దేశ అధికారులు అరెస్టు చేసిన భారత మత్స్యకారులను విడుదల చేయడంలో దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ‘తమిళ మత్స్యకారులను, వారి పడవలను శ్రీలంక నేవీ తరచుగా సీజ్ చేస్తున్నది. ఈ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేయడమే గాక..మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది’ అని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ యాక్షన్‌ గ్రూప్‌ను పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు. తమిళ మత్స్యకారుల భద్రతకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన తీర్మానం అవసరమని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. శ్రీలంక అదుపులో ఉన్న మత్య్సకారులను వెంటనే రిలీజ్ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

28 రోజుల్లోనే 88మంది అరెస్టు

2023లో మొత్తంగా శ్రీలంక నేవీ 243 మంది మత్స్యకారులను అరెస్టు చేసి 37 పడవలను సీజ్ చేయగా..గత 28 రోజుల్లోనే 88 మంది భారత మత్య్సకారులను అరెస్టు చేసి.. 12 పడవలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పడవలను ధ్వంసం చేసిన ఘటనలూ ఉన్నాయి. 2018లో శ్రీలంక చేపల పెంపకం చట్టానికి చేసిన సవరణ అంశాన్ని తాను గతంలో ప్రధాని మోడీతో లేవనెత్తానని, ఇది శ్రీలంక విదేశీ మత్స్యకారుల నౌకలను జాతీయం చేయడానికి వీలు కల్పించిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed