కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

by Disha Web Desk 4 |
కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో భూ వివాదంలో ఇరువర్గాలు కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మోరెనా జిల్లా లేపా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొంతకాలంగా లేప గ్రామానికి చెందిన రంజిత్ తోమర్, రాధే తోమర్ మధ్య భూమి విషయంలో వివాదం నడుస్తోంది. అయితే 2014లో రాధే తోమర్‌ కుటుంబానికి చెందిన ముగ్గురిని రంజిత్‌ తోమర్‌ వర్గం హత్య చేసింది. ఆ తర్వాత రంజిత్‌ తోమర్‌ కుటుంబం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది.

రెండ్రోజుల క్రితం తోమర్‌ కుటుంబం గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో రాధే తోమర్ వర్గం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో రంజిత్ తామెర్ వర్గానికి చెందినవారు ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతులు లెస్ కుమారి భార్య వీరేంద్ర సింగ్, బాబ్లీ భార్య నరేంద్ర సింగ్ తోమర్, మధు కుమారి భార్య సునీల్ తోమర్, గజేంద్ర సింగ్ కుమారుడు బద్లు సింగ్, సత్యప్రకాష్ కుమారుడు గజేంద్ర సింగ్, సంజు కుమారుడు గజేంద్ర సింగ్. గాయపడిన వారిలో వినోద్ సింగ్ కుమారుడు సురేష్ సింగ్ తోమర్, వీరేంద్ర కుమారుడు గజేంద్ర సింగ్‌గా గుర్తించారు. అయితే కాల్పుల ఘటన తర్వాత రంజిత్ తోమర్ వర్గం నిందితులు గ్రామం నుంచి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Next Story

Most Viewed