కాంగ్రెస్‌ పార్టీకి షాక్: మరోసారి నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

by Dishanational2 |
కాంగ్రెస్‌ పార్టీకి షాక్: మరోసారి నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ మరో షాక్ ఇచ్చింది. 2014 నుంచి 2017 వరకు రూ.1745 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. 2014-15కి రూ.663 కోట్లు, 2015-16కి రూ.664 కోట్లు, 2016-17కి రూ.417 కోట్లు కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తాజా నోటీసులతో కలిపి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఇప్పటి వరకు ఐటీ శాఖ నుంచి రూ.3567 కోట్ల టాక్స్ నోటీసులను అందుకుంది. రెండు రోజుల క్రితం 2017-18, 2020-21కి సంబంధించిన పన్ను వడ్డితో కలిపి రూ.1823 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. అనంతరం అదే రోజు రాత్రి మరో రెండు నోటీసులు జారీ చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఆయన ప్రకటించిన మరుసటి రోజే ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. కాగా, గత సంవత్సరాలకు సంబంధించిన పన్నుల కోసం ఇప్పటికే పార్టీ ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ శాఖ అధికారులు రికవరీ చేశారు. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. సోమవారం విచారణ జరగనుంది.

Next Story

Most Viewed