Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లు కోల్పోవచ్చు!

by Disha Web Desk 2 |
Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లు కోల్పోవచ్చు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే 50 సీట్లు తక్కువ వస్తాయని జోస్యం చెప్పారు. శుక్రవారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడిన ఆయన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎంపీలను కోల్పోబోతోందని అన్నారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోల్పోవడం అసాధ్యమేమి కాదని చెప్పారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో అధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకున్నా ఇటీవల ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లో బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలిచిందని అలాగే బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ కొన్ని సీట్లు గెలవగలిగింది. పశ్చిమబెంగాల్‌లో ఆ పార్టీ 18 స్థానాలు దక్కించుకుంది. పుల్వామా దాడులు, బాలాకోట్ సమ్మె చివరి నిమిషంలో బీజేపీకి అనుకూలంగా వేవ్ క్రియేట్ క్రియేట్ చేసింది. కానీ 2024లో ఆ పరిస్థితి ఉండబోదు. గతంలో గెలిచిన స్థానాల కంటే 50 సీట్లు తక్కువగా వస్తాయి. అయితే విపక్షాల కలిసి ఉంటాయా అనే అంశంపై స్పందిస్తూ అది చెప్పడం కష్టం అన్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 మాత్రమే గెలుచుకుంది.

Next Story

Most Viewed