బిగ్ బ్రేకింగ్: అగ్నిపథ్ స్కీమ్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: అగ్నిపథ్ స్కీమ్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై రాజకీయంగా భిన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. ఢిల్లీ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. అగ్నిపథ్ పథకాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని ధర్మాసనం పేర్కొంది. గత ఏడాది జూన్ 14న సాయుధ బలగాల రిక్రూట్మెంట్ కోసం కేంద్రం ఈ పథకాన్ని అనౌన్స్ చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ 2022 జులై నెలలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. మిగతా రాష్ట్రాల్లోనూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. దీంతో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు గత డిసెంబర్ 15న తన ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మరింత రూట్ క్లియర్ అయింది.

ఇవి కూడా చదవండి: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

Next Story

Most Viewed