సబ్ కా సాథ్ నహీ.. బ్రిజ్ భూషణ్ కా సాథ్: కపిల్ సిబల్ సెటైర్లు

by Javid Pasha |
సబ్ కా సాథ్ నహీ.. బ్రిజ్ భూషణ్ కా సాథ్: కపిల్ సిబల్ సెటైర్లు
X

న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై కేంద్ర సర్కారు మౌనాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు. "సబ్ కా సాథ్ నహీ.. బ్రిజ్ భూషణ్ కా సాథ్" (అందరితో కాదు.. బ్రిజ్ భూషణ్‌తో) అని ట్విట్టర్ వేదికగా శనివారం కామెంట్ చేశారు. "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" అనే కేంద్ర ప్రభుత్వ నినాదంపై ఈవిధంగా ఆయన వ్యంగ్య వ్యాఖ్య చేశారు. “సాక్ష్యాలున్నా.. ప్రజలు నిరసన తెలుపుతున్నా బ్రిజ్ భూషణ్ సింగ్ ఇప్పటికీ అరెస్టు కాలేదు.

ప్రధాని మౌనం, కేంద్ర హోం మంత్రి మౌనం, బీజేపీ మౌనం, ఆర్‌ఎస్‌ఎస్ మౌనం.. బ్రిజ్ భూషణ్ కేసును దర్యాప్తు చేస్తున్న వారికి కావాల్సినంత సందేశం ఇదే" అని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా ప్రధాని మోడీ, అధికార బీజేపీ మౌనం వీడాలని కోరారు. యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఇటీవల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఎన్నికలేతర వేదిక “ఇన్సాఫ్”ను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

ఆసుపత్రిలో భార్యను పరామర్శించిన మనీష్ సిసోడియా

Advertisement

Next Story

Most Viewed