ఆయన వయసు మళ్లిన వ్యక్తి.. ధనికుడు.. చెడు అభిప్రాయాలు కలిగినవాడు

by Dishanational1 |
ఆయన వయసు మళ్లిన వ్యక్తి.. ధనికుడు.. చెడు అభిప్రాయాలు కలిగినవాడు
X

న్యూఢిల్లీ: అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన వయసు మళ్లిన వ్యక్తి.. ధనికుడు.. చెడు అభిప్రాయాలు కలిగిన ప్రమాదకరమైన వాడని విమర్శించారు. తన మాటలతో ప్రపంచాన్ని శాసించాలనే థృక్పథాన్ని కలిగి ఉన్నాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి కథనాలను రూపొందించడంలో వనరులను పెట్టుబడులు పెడుతారని మండిపడ్డారు. 'అతని లాంటి వ్యక్తులు తనకు నచ్చిన వ్యక్తి గెలిస్తే ఎన్నికలు మంచివని భావిస్తారు. లేకపోతే విమర్శలు చేస్తారు. ఇదంతా బహిరంగ సమాజం వాదించాలనే నెపంతో జరగుతుంది' అని అన్నారు.

అంతకుముందు సొరస్.. అదానీ స్టాక్ మార్కెట్లో పతనమవడం భారత ప్రధాని మోడీకి నష్టాన్ని మిగులుస్తాయని అన్నారు. అవసరమైన వ్యవస్థాపక సంస్కరణలకు తలుపులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. అయితే సొరస్ వ్యాఖ్యలు భారత్‌పై దాడి అని కేంద్రం విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే సొరస్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. గతంలోనూ ఇదే చేశానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు భారత్ ప్రజాస్వామ్యాన్ని ఆపాదించడం కాస్తా ఎబ్బెట్టుగా ఉందన్నారు. సొరస్ వ్యాఖ్యలను కాకుండా నౌరిల్ రౌబిని వ్యాఖ్యలను పట్టించుకోవాలని సూచించారు. భారత్ పెద్ద ప్రైవేట్ సమ్మేళనాలచే ఎక్కువగా నడపబడుతోందని రౌబిన్ ఓ సందర్భంలో అన్నారు. ఇది కొత్త వారిని అడ్డుకుంటుందని చెప్పారు.

Next Story

Most Viewed