ఒకే వేదికపై గడ్కరీ, అదానీ, ఆరెస్సెస్ చీఫ్..

by Disha Web Desk 13 |
ఒకే వేదికపై గడ్కరీ, అదానీ, ఆరెస్సెస్ చీఫ్..
X

నాగపూర్: గురువారమిక్కడ ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూర్ నాగపూర్ రెండో దశ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఒకే వేదికను పంచుకున్నారు. అత్యాధుని సౌకర్యం, అందుబాటు ధరలతో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సంరక్షణను అందిచాలన్న ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు.

ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేష్ జోగ్లేకర్ అతిథులను సత్కరించారు. తర్వాత అధునాతన రోగ నిర్ధారణ, చికిత్సా సేవలను ఆయన వివరించారు. ఇది ఆస్పత్రిలా కనిపించకూడదని, దీనిని ఎవ్వరూ ఆస్పత్రిలా భావించకూడదని, ఇక్కడ ఆస్పత్రి వాసన రాకూడదని తాము తొలి రోజే నిర్ణయించుకున్నట్టు శైలేష్ చెప్పారు. ఈ కార్యక్రమానికి 5 వేల మందికి పైగా ప్రజలు వచ్చారు. ఈ ఘనత ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు దక్కింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఈ ఇన్‌స్టిట్యూట్ సేవలను ఆయన కొనియాడారు.



Next Story