బెట్టింగ్ యాప్ నుంచి CMకు రూ.508 కోట్ల చెల్లింపులు.. స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
బెట్టింగ్ యాప్ నుంచి CMకు రూ.508 కోట్ల చెల్లింపులు.. స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎలక్షన్ వేళ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఛత్తీస్ గఢ్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా సీఎం భూపేష్ బఘేల్‌కు బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇక, ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి స్పందిస్తూ.. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల సాయంతోనే కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో పోరాడుతుందన్నారు. సీఎం ప్రచారానికి ఏకంగా బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వినియోగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని స్మృతి అన్నారు. పవర్‌లో ఉండగా సీఎం బెట్టింగ్ ఆడారని ఆరోపించారు. కాగా, సీఎం భూపేష్‌పై ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. బీజేపీ కావాలనే ప్రజల ముందు సీఎం ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో ఓటమి ఖాయమనే కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.



Next Story

Most Viewed