ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రిపోర్టు ఇదే...

by Disha Web Desk 16 |
ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రిపోర్టు ఇదే...
X

దిశ, వెబ్ డెస్క్: సిగ్నల్ లోపం కారణంగానే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 250 మందికిపైగా మృతి చెందగా.. 1000 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. నివేదిక రెడీ చేసి మీడియాకు విడుదల చేసింది. ‘లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ ను కోరమండల్ ఢీకొట్టింది. మెయిల్ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్ ఇచ్చారు. కోరమాండల్ రైలు మాత్రం పొరపాటున లూప్ లైన్‌లోకి వెళ్లింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ వచ్చింది.’ అని రైల్వే శాఖ ప్రాథమిక రిపోర్టులో వెల్లడించింది.



Next Story