దేశాన్ని ఆరెస్సెస్-బీజేపీ ఎంతకాలం బలహీనపరుస్తాయి: రాహుల్ గాంధీ

by Disha Web Desk 21 |
దేశాన్ని ఆరెస్సెస్-బీజేపీ ఎంతకాలం బలహీనపరుస్తాయి: రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ ఆకలి సూచిక‌లో భారత ర్యాంకు పడిపోవడాన్ని ఉద్దేశించి కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.వాస్తవికత నుండి ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా భారతదేశాన్ని ఆర్‌ఎస్సెస్-బీజేపీ ఎంత కాలం బలహీనపరుస్తాయని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 'ఆకలి, పోషకాహార లోపంలో భారత్ 121 దేశాల్లో 107వ స్థానంలో ఉంది. 'భారతదేశంలో ఆకలి పెరగడం లేదు, ఇతర దేశాలలో ప్రజలు ఆకలితో బాధపడటం లేదు' అని ప్రధాని, కేంద్ర మంత్రులు అంటారు' అని సెటైరికల్ ట్వీట్ చేశారు.

వాస్తవికత నుండి ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా భారతదేశాన్ని ఆర్‌ఎస్సెస్-బీజేపీ ఎంతకాలం బలహీన పరుస్తాయని ప్రశ్నించారు. కాగా, శనివారం ప్రకటించిన ఆకలి సూచిలో భారత్ 29.1 స్కోరుతో అత్యంత ప్రమాదకర జాబితాలో ఉంది. అయితే పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.


Next Story

Most Viewed