రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యకు కోర్టు సమన్లు

by Dishanational1 |
రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యకు కోర్టు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 శాతం కమిషన్‌లు తీసుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాది వినోద్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారనకు స్వీకరించిన ధర్మాసనం మార్చి 28న కోర్టుకు హాజరు కావాలని ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగిన సమయంలో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. అందులో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న బసవరాజ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. బీజేపీ పాలనలో 40 శాతం కమీషన్ ఇవ్వాలని సూచిస్తూ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై లాయర్ వినోద్ కుమార్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలను సంబంధించిన కేసు విచారణను ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టు గతవారం ప్రభుత్వానికి పేర్కొంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది.

Next Story

Most Viewed