రాహుల్‌పై వేటుతో వచ్చే నెలలో వయానడ్ ఉపఎన్నికపై ప్రకటన..!

by Disha Web Desk 17 |
Who are the people to support the Mafia from the Gujarat government? Asks Rahul Gandhi
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై వేటు నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయానడ్ నియోజకవర్గం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉప ఎన్నిక నిర్వహణపై వచ్చే నెలలో ప్రకటన ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికార వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. అయితే రాహుల్ గాంధీ‌పై కోర్టును ఆశ్రయించిన క్రమంలో ఆయనకు సానుకూలంగా తీర్పు వస్తే తిరిగి కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ లేనిపక్షంలో ఎన్నిక అనివార్యం కానుంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సునీర్ పై రాహుల్ 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Next Story

Most Viewed