ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్.. మొత్తం ఎంతశాతం నమోదైందంటే?

by Disha Web Desk 2 |
ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్.. మొత్తం ఎంతశాతం నమోదైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 224 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. ఎన్నికల పోలింగ్ సమయం ముగియడంతో ఇంకా కొంత మంది క్యూ లైన్‌లో ఉన్నారు. దీంతో వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. అటు సాయంత్రం 5 వరకు 65.69 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా, కర్ణాటక వ్యాప్తంగా 2615 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 58,545 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరిగింది. 5 కోట్ల 31 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు 4 లక్షల మంది ఎన్నికల విధులు నిర్వహించారు. ఈనెల 13నే ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అభ్యర్థుల్లో ఇప్పటి నుంచే ఉత్కంఠత నెలకొంది.

ఇవి కూడా చదవండి:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆకట్టుకున్న వృద్ధులు.. భారీ సంఖ్యలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు

కాంగ్రెస్ మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ: నిర్మలా సీతారామన్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed