ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

by Disha Web Desk 2 |
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 71.11 పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కించనున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్ ఘడ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ సమయాల్లో మార్పులు చేశారు.

మధ్యప్రదేశ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించారు. ఛత్తీస్ ఘడ్‌లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరిగింది.



Next Story

Most Viewed