గంభీర్‌, కోహ్లీ హగ్ పై పొలిటికల్ రంగు.. నెటిజన్ల కామెంట్లతో కొత్త దుమారం

by Disha Web Desk 13 |
గంభీర్‌, కోహ్లీ హగ్ పై పొలిటికల్ రంగు.. నెటిజన్ల కామెంట్లతో కొత్త దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ హగ్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండగా తాజాగా వీరిద్దరూ కలిసిపోయారు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా స్ట్రాటజిక్ టైమ్ లో గంభీర్, కోహ్లీ ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని హగ్ చేసుకున్నారు. దీంతో వీరి వైరానికి బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ వీరిపై ప్రశంసలు కురిపిస్తుండగా ఈ వ్యవహారానికి కొంత మంది రాజకీయరంగు పులుముతున్నారు. కొంత మంది నెటిజన్లు పొలిటికల్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గౌతం గంభీర్ బీజేపీని వీడటం వల్లే ఆయనలోని ధ్వేషం పోయిందని మనీశ్ ఆర్ జే అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. 'ఒక వ్యక్తి బీజేపీని వీడినప్పుడు ద్వేషం ఆటోమేటిక్‌గా మాయమవుతుంది' బీజేపీని వీడిన తర్వాత గంభీర్ లో మార్పు వచ్చి అప్యాయంగా కలిసిపోయాడనే అర్థం వచ్చేలా ఫోటోను షేర్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతూ గంభీర్ బీజేపీని వీడలేదని ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేయడం లేదంతే అంటూ గంభీర్ ట్విట్టర్ కు సంబంధించిన స్క్రీన్ షార్ట్ లు పోస్ట్ చేస్తున్నారు. మరొ నెటిజన్ రియాక్ట్ అవుతూ కోహ్లీనే త్వరలో బీజేపీలో చేరుతాని ప్రతి నాణేనికి రెండు వైపులు ఉంటాయని చేశారు. మొత్తంగా గంభీర్, కోహ్లీ కలిసిపోయిన వ్యవహారం పొలిటికల్ గా కూడా చర్చకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది.

కాగా.. 2013 ఐపీఎల్ లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ సమయంలో ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం నెట్టేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. 2015లో ఐపీఎల్ సీజన్ లో మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ లో కేకేఆర్ పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా వీరిద్ధరి మధ్య వైరలం కంటిన్యూ అవుతుండగా నిన్నటి మ్యాచ్ లో మాత్రం ఆప్యాయంగా పలకరించుకున్నారు.

Next Story

Most Viewed