ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళన వద్దంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి

by Disha Web Desk 17 |
ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళన వద్దంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉధృతమవుతున్న ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. దీనికి కారణం ఆసుపత్రుల్లో చేరికలు ఎక్కువగా లేకపోవడమేనని అన్నారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిబంధనలు సవరించిన సంగతి తెలిసిందే. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదని పేర్కొంది. దీంతో పాటు స్థానిక అంటువ్యాధులను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని సూచించింది. ఈ నెలలో ఒక్కరోజులో 3 వేలకు పైగా కొత్త కేసులు రెండు సార్లు వెలుగుచూశాయి.



Next Story

Most Viewed