పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్‌కు సమన్లు జారీ చేసిన నోయిడా కోర్టు

by Disha Web Desk 17 |
పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్‌కు సమన్లు జారీ చేసిన నోయిడా కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ నుంచి తన పిల్లలతో కలిసి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌పై ఆమె మొదటి భర్త గులాం హైదర్ కోర్టులో కేసు వేయగా తాజాగా నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. కరాచీలో నివసిస్తున్నటువంటి గులాం హైదర్ - సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటును సవాలు చేస్తూ భారత న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో గులాం హైదర్ తన పిల్లల మత మార్పిడిని కూడా సవాలు చేశాడు. గులాం హైదర్ నుంచి సీమా విడాకులు తీసుకోలేదని, సచిన్‌తో ఆమె వివాహం చెల్లదని గులాం హైదర్ తరఫు న్యాయవాది మోమిన్ మాలిక్ కోర్టులో వాదించారు. మే 27న కోర్టుకు హాజరు కావాలని విచారణను వాయిదా వేశారు.

ఇటీవలే సీమా హైదర్, సచిన్ మీనా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు, దీన్ని కూడా కోర్టులో సవాలు చేసినట్లు అడ్వకేట్ మోమిన్ మాలిక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కేసులో పార్టీలుగా చేర్చారు. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ PUBG ఆడుతున్నప్పుడు భారత్‌లోని గ్రేటర్ నోయిడాలోని రబుపురాకు చెందిన సచిన్‌ మీనాతో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ నేపాల్‌లో కలుసుకోగా ఆ సమయంలో వారు వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల తరువాత ఆమె తన పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేయగా బెయిల్‌ మీద బయటికివచ్చారు. ప్రస్తుతం వారు రబూపురలో నివసిస్తున్నారు.


Next Story

Most Viewed