పదవులు ఇచ్చి శాంతింపజేసే సంప్రదాయం లేదు: రాజస్థాన్ ముఖ్యమంత్రి

by Disha Web Desk 17 |
పదవులు ఇచ్చి శాంతింపజేసే సంప్రదాయం లేదు: రాజస్థాన్ ముఖ్యమంత్రి
X

న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. అయితే పార్టీ హై కమాండ్ బలంగా ఉందని.. నేతలను లేదా కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఎటువంటి పదవులు ఇవ్వదని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు గెహ్లాట్, సచిన్ పైలట్‌లను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారిద్దరితో వేరువేరుగా సమావేశం కానున్నారు.

పైలట్ ఇచ్చిన అల్టిమేటం గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను చేసిన మూడు డిమాండ్లను ఈ నెలాఖరు (మే) లోగా పూర్తి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతానని పైలట్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని పైలట్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఏ నాయకుడినైనా శాంతింపజేసేందుకు పదవులు ఇచ్చే సంప్రదాయం పార్టీలో లేదని గెహ్లాట్ చెప్పారు. ‘నాకు తెలిసినంత వరకు ఎవరైనా నాయకుడు ఏదైనా డిమాండ్ చేస్తే దానిని అతనికిచ్చే సాంప్రదాయం కాంగ్రెస్‌లో లేదు. అటువంటి ఫార్ములా గురించి నేను ఎప్పుడూ వినలేదు’ అని గెహ్లాట్ చెప్పారు.

పైలట్‌ను దారిలోకి తెచ్చేందుకు ఏదో ఫార్ములాను సిద్ధం చేస్తున్నారన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అది కేవలం మీడియా సృష్టి అని.. కొందరు నేతలు ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటివి గతంలో లేవని.. భవిషత్తులోనూ ఉండవని ఆయన చెప్పారు.


Next Story

Most Viewed