తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు

by Disha Web Desk 4 |
తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లోని రెండు రాష్ట్రల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. తమిళనాడులోని 10 కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలువురి ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

టెర్రర్ ఫండింగ్ కేసులో.. జమాతే ఏ ఇస్లామి సంస్థతో సంబంధాలున్న పలువురి ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తమిళనాడులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పీఎఫ్‌ఐ మదురై ప్రాంతీయ అధ్యక్షుడు మహ్మద్‌ ఖైజర్‌, తేని ఎస్‌డీపీఐ జిల్లా కార్యదర్శి సాదిక్‌ అలీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed