దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో NIA సోదాలు

by Disha Web Desk 2 |
దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో NIA సోదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై ఎన్ఐఏ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు మంగళవారం ఉదయం నుండి ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లోని 12 ప్రాంతాల్లో, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు చోట్ల, పంజాబ్, గోవాలలో ఒక్కోచోట ఎన్ఐఏ సోదాలు చేస్తుంది.

నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాల గురించి సమాచారం రావడంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా స్థానిక పోలీసులు చెప్పారు. కాగా, 2022 సెప్టెంబర్‌లో పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు సీరియస్ క్రైమ్‌‌కు పాల్పడుతున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ కార్యకాలపాలు వెలుగుచూశాయి. నిజామాబాద్‌లో పీఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed