భారతీయూలకు గుడ్ న్యూస్.. స్కెంజెన్ వీసా కొత్త నిబంధనలు ఇవే..!

by Dishanational6 |
భారతీయూలకు గుడ్ న్యూస్.. స్కెంజెన్ వీసా కొత్త నిబంధనలు ఇవే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: స్కెంజెన్ వీసాతో పర్యటించే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈయూ. దీనిపైనే యూరోపియన్ యూనియన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. స్కెంజెన్ (షార్ట్-స్టే) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారత పౌరులకు వీసా క్యాస్కేడ్ విధానం తీసుకొచ్చింది. ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాపై మల్టీ ఇయర్ వాలిడిటీ ఉంటుందని పేర్కొంది.

యూరోపియన్ కమీషన్ ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను ఆమోదించింది. ఇది ఇప్పటి వరకు వర్తించే వీసా కోడ్ ప్రామాణిక నిబంధనల కంటే చాలా అనుకూలమైందిగా ఉంది.

కొత్తగా వచ్చిన వీసా "క్యాస్కేడ్" విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశాల కోసం స్కెంజెన్ వీసాలు జారీ చేయనున్నారు. దీనికోసం గత మూడేళ్లలో కచ్చితంగా రెండుసార్లు వీసా అప్రూవ్ కావాలి. చట్టబద్ధంగా దాన్ని వాడుకుంటే తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

ఈయూ, భారత్ మధ్య మైగ్రేషన్ విధానంపై సమగ్ర సహాకాన్ని కోరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈయూ అధికారులు. స్కెంజెన్ వీసా పొందితే ఏదైనా 180 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 90 రోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రయాణించవద్దు. ఈ వీసాలతో ఈయూలో పనిచేసే హక్కు మాత్రం ఉండదు. ఇకపోతే, స్కెంజెన్ ప్రాంతంలో 29 యూరోపియన్ దేశాలు ఉన్నాయి.



Next Story

Most Viewed