బ్రిటన్ ప్రభుత్వ ఇంఛార్జిగానే లిజ్ ట్రస్.. నూతన ఆర్థిక మంత్రి స్పష్టత

by Disha Web Desk 21 |
బ్రిటన్ ప్రభుత్వ ఇంఛార్జిగానే లిజ్ ట్రస్.. నూతన ఆర్థిక మంత్రి స్పష్టత
X

లండన్: బ్రిటన్ అధికార మార్పిడి సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో నూతనంగా నియమితులైన ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వ ఇంఛార్జిగా కొనసాగుతారని ఆదివారం స్పష్టతనిచ్చారు. ఆమె పదవిపై గందరగోళ పరిస్థితుల తర్వాత పార్టీ ఆమె స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనను తిరస్కరించినట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తమ సభ్యులు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.

తాజాగా ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో దేశం ఆర్థిక మాంద్యం దిశగా సాగుతుందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. మాజీ ఆర్థిక మంత్రి కార్టెంగ్ పన్నుల కోతలు తగ్గించడం, ఇతర చర్యలతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఢీలా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే బ్రిటన్ కరెన్సీ విలువ తగ్గింది. దీంతో వెంటనే మంత్రిని పదవి నుంచి తప్పించి దిద్దుబాటు చర్యలకు దిగారు.


Next Story