6న నేవీ అమ్ములపొదిలోకి ‘సీ హాక్’.. ఈ హెలికాప్టర్ల పవర్ తెలుసా ?

by Dishanational6 |
6న నేవీ అమ్ములపొదిలోకి ‘సీ హాక్’.. ఈ హెలికాప్టర్ల పవర్ తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను రంగంలోకి దించనుంది భారత నేవీ. సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసేందుకు, నిఘా పెంచేందుకు ఈ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నట్లు ప్రకటించింది నేవీ. మార్చి 6న కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడలో హెలికాప్టర్ కు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేవీల్లో ఒకటిగా భారత్ కు పేరుంది. సీహాక్ రాకతో నేవీకి మరింత శక్తి పెరగనుంది.

సీహాక్ ప్రత్యేకతలివే

భారత జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల కెపాసిటీ ఈ హెలికాప్టర్లకు ఉంది. శత్రుస్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు. సముద్రంలోని జలంతర్గాములను, సముద్రం ఉపరితలంపైనున్న శత్రు దేశ నౌకలను గుర్తించి దాడి చేయలవు. కేవలం నిమిషాల వ్యవధిలోనే దాడి చేసే సామర్థ్యం కలదు. శత్రునౌకలు, జలంతర్గాములపై దాడి, రెస్క్యూ ఆపరేషన్, సిబ్బందిని బదిలీ చేసే వ్యవస్థ, వైద్య సామగ్రి తరలింపు ఫెసిలిటీలన్నీ ఈ హెలికాప్టర్ లో ఉన్నాయి.

ఫోల్డబుల్ రోటర్లు, టెయిల్ ఉండడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. అందుకే ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ కు చాలా తక్కువ స్థలం ఉంటే సరిపోతుంది. చిన్న యుద్ధనౌకలో దీన్ని తరలించవచ్చు. డ్యూయల్ ఎంబెడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా దీనికి కచ్చితమైన నావిగేషన్ ఉంటుంది. హెలికాప్టర్‌లోని AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులు, 38 లేజర్-గైడెడ్ రాకెట్‌లు, నాలుగు MK54 టార్పెడోలు, మెషిన్ గన్‌లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు వాడుకోవచ్చు. సముద్ర రంగంలో సైనిక అవసరాల కోసం ఉపయోగపడే ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ MH60R అని అధికారులు అన్నారు. సముద్ర సరిహద్దుల్లో శత్రువినాశనానికి ఈ హెలికాప్టర్ అత్యుత్తమమం అని అన్నారు.

మరోవైపు MH 60R సీహాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు ఉన్నాయి. వీటి వల్ల ఎదురుగా ఉన్న జలంతర్గామి లేదా క్షిపణిని గుర్తించగలవు. ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు. హెలికాప్టర్ గ్లాస్ కాక్‌పిట్ మల్టిపుల్ డిజిటల్ కాక్‌పిట్. ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఇందులో మిస్సైల్ వార్నింగ్ సిస్టమ్, లేజర్ వార్నింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ మిస్సైల్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ విమానం రక్షణ, యుద్ధరంగంలో ప్రభావం చూపగలదు. ట్రయల్స్ పూర్తైన తర్వాత ఆరు MH 60R సీహాక్ హెలికాప్టర్లను INAS 334 ద్వారా ఇండియన్ నేవీలో మోహరించనున్నారు.

ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం

ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా నుంచి భారత్ 24 MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. మొదటి దశలో ఆరు హెలికాప్టర్లు సౌత్ నేవీ ఫోర్స్ లో చేరతాయి. 2020 ఫిబ్రవరిలో భారత్ MH 60R సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.

రెండేళ్ల క్రితమే కొచ్చికి రెండు MH-60R చాపర్లను వచ్చాయి. రాబోయే దశాబ్దాల్లో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్, యాంటీ-షిప్ వార్‌ఫేర్, ఎయిర్‌బోర్న్ ముందస్తు హెచ్చరిక సామర్థ్యాలకు ఈ హెలికాప్టర్లు ముఖ్యమని భావిస్తున్నారు అధికారులు. 18 ఏళ్ల క్రితం నేవీ మల్టీ రోల్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భావించింది. కాగా.. MH-60R హెలికాప్టర్‌ల సుమారు రూ.17,500 కోట్ల ఒప్పందం జరిగింది.


Next Story

Most Viewed