ముస్లింలు వాటిని మాత్రమే అనుసరిస్తారు: ఎస్పీ నేత కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
ముస్లింలు వాటిని మాత్రమే అనుసరిస్తారు: ఎస్పీ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేస్తూ అసోం సీఎం హిమంత బిస్వశర్మ తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ ఎస్టీ హసన్ స్పందించారు. ముస్లింలు షరియత్, ఖురాన్‌లను మాత్రమే అనుసరిస్తారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లింలు వారికి కావాల్సినన్ని చట్టాలను తయారు చేసుకోవచ్చని, అసోం కేబినెట్ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతీ మతానికి సొంత ఆచారాలు ఉన్నాయని, వాటిని వేళ సంవత్సరాల నుంచి ఆనుసరిస్తున్నారని..ప్రస్తుతం కూడా అవే కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్నందు వల్లే బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

అసోం సీఎంకు అంత ధైర్యం లేదు: ఏఐయూడీఎఫ్

ఉత్తరాఖండ్ తరహాలో రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)ని తీసుకొచ్చే ధైర్యం సీఎం హిమంత బిస్వశర్మకు లేదని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ రఫీకుల్ ఇస్లాం అన్నారు. యూసీసీ తీసుకొచ్చే దమ్ము అసోం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నందు వల్లే బీజేపీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంది. అసోంలో బహుభార్యత్వం, యూసీసీ లాంటి బిల్లును తీసుకురాలేకపోయారు. అందుకే ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రాజ్యాంగ హక్కును రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు’ అని హఫీజ్ రఫీకుల్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed