స్లో పాయిజన్ ఇచ్చి నాన్నను చంపారు.. అన్సారీ మృతిపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు

by Dishanational6 |
స్లో పాయిజన్ ఇచ్చి నాన్నను చంపారు.. అన్సారీ మృతిపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణంపై అతని కుమారుడు ఉమర్ అన్సారీ సంచలన ప్రకటన చేశారు. అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు దీనిపైకోర్టుని ఆశ్రయించనున్నట్లు వివరించారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురైన తన తండ్రిని చూసేందుకు వచ్చానని.. కానీ తనను అనుమతించలేదని అన్నారు.

ముఖ్తార్ అన్సారీ మరణంపై, కుమారుడు ఉమర్ అన్సారీ మాట్లాడుతూ.. అడ్మినిస్ట్రేషన్ నుంచి తనకు ఏమీ చెప్పలేదని అన్నారు. ఈ విషయం తనకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. రెండు రోజుల క్రితం నేను ఆయనను కలవడానికి వచ్చానని తెలిపారు. కానీ తన తండ్రిని కలిసేందుకు తనను అనుమతించలేదన్నారు. ముఖ్తార్ కు స్లో పాయిజన్ ఇచ్చారని ఇంతకు ముందు కూడా చెప్పామని.. ఇప్పుడు కూడా చెబుతున్నాం అని అన్నారు. మార్చి 19న డిన్నర్ లో విషం ఇచ్చినట్లు ఉమర్ తెలిపారు. దీనిపై న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామన్నారు.

ఇకపోతే మార్చి 19న తనపై విషప్రయోగం జరుగుతోందని కోర్టుకు లేఖ రాశారు ముఖ్తార్. ఆ తర్వాతే ఆయన ఆరోగ్యం క్షీణించింది. అతడ్ని ఐసీయూకి తరలించారు. ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. దీనిపైనా ఉమర్ మండిపడ్డారు. ఐసీయూ నుంచి వార్డుకి తరలిస్తారు కానీ.. తన తండ్రిని మాత్రం ఐసీయూ నుంచి జైళ్లో పెట్టారని ఉమర్ మండిపడ్డారు.

ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి కుటుంబీకుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీని వీడియోగ్రఫీ కూడా చేయనున్నారు. ఐదుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ నుంచి వైద్యుల బృందాన్ని రప్పించారు. పోస్టుమార్టం తర్వాత అతని మృతదేహాన్ని బందా నుంచి ఘాజీపూర్‌కు తరలించనున్నారు. ముఖ్తార్ అన్సారీని మొహమ్మదాబాద్‌లోని కాలీబాగ్ శ్మశానవాటికలో ఖననం చేయనున్నారు.

యూపీలో 144 సెక్షన్ విధింపు

ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. బందా, మౌ, ఘాజీపూర్, వారణాసిలో స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలు మోహరించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed