యాప్‌లపై కేంద్రం కొరడా.. 500 పైగా యాప్స్ నిషేధం

by Disha Web Desk 13 |
యాప్‌లపై కేంద్రం కొరడా.. 500 పైగా యాప్స్ నిషేధం
X

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. దేశంలో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 500లకు యాప్‌లను నిషేధించినట్లు మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. భారత సైబర్ క్రైమ్ కోఅర్డినేషన్ సెంటర్ ప్రతిపాదనల ప్రకారం భద్రత కారణలతో యాప్‌లను నిషేధించినట్లు షా చెప్పారు. మంగళవారం ఆయన ఎన్డీసీసీ భవన్ సైబర్ క్రైమ్ సెంటర్ పనితీరును సమీక్షించారు. ఈ యూనిట్ టాప్ 50 సైబర్ దాడుల కార్యనిర్వహణపై విశ్లేషణాత్మక నివేదికను సిద్ధం చేసిందని తెలిపారు.

రాష్ట్రాలతో డేటాను పంచుకోవడమే కాకుండా ఎయిమ్స్ సైబర్ దాడిని కూడా ఈ విభాగం దర్యాప్తు చేస్తోందని చెప్పారు. సైబర్ భద్రత జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా చూడడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 ద్వారా 250 బ్యాంకులు, ఫైనాన్స్ మధ్యవర్తిత్వాలతో అనుసంధానమైంది. ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు 1.33 లక్షల మందికి చెందిన రూ. 235 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Next Story