మోడీ స్నేహితుల వద్దే 70 కోట్ల భారతీయుల సంపద!.. ఖర్గే సంచలన ఆరోపణలు

by Disha Web Desk 5 |
మోడీ స్నేహితుల వద్దే 70 కోట్ల భారతీయుల సంపద!.. ఖర్గే సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ దేశంలోని 70 కోట్ల మంది భారతీయుల సంపద మోడీ 22 మంది స్నేహితుల వద్ద ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని చెంగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం చాలా పెరిందని, అది బ్రిటీష్ రాజ్యంలో కంటే 100 సంత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని అన్నారు. గత పదేళ్లలో మోదీజీ తన సన్నిహితులు ఇద్దరు ముగ్గురు కోసం మాత్రమే పని చేశారు.

దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు, పీఎస్‌యూలతో సహా అన్ని జాతీయ వనరులను ఈ సూపర్ రిచ్ క్రోనీ క్యాపిటలిస్టులకు విసిరివేయబడ్డ ధరలకే విక్రయించబడ్డాయని విమర్శించారు. అంతేగాక 70 కోట్ల మంది భారతీయుల సంపద మోదీజీ స్నేహితులైన టాప్ 22 మంది ధనవంతుల వద్దే ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేళ్లలో లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రోజుకు సగటున ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. భారతదేశంలో తొలిసారిగా రైతులపై పన్నులు విధించింది మోదీ ప్రభుత్వమేనని ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed