మోడీ ప్రభుత్వం "5G మెగా స్కామ్"ని ప్రోత్సహిస్తోంది: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

by Disha Web Desk 17 |
మోడీ ప్రభుత్వం 5G మెగా స్కామ్ని ప్రోత్సహిస్తోంది: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం 5G మెగా స్కామ్‌ని ప్రోత్సహిస్తుందని, మోడీ పరిపాలన దేశం కంటే తన స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ఇటీవల 2జీ స్పెక్ట్రమ్ కేసులో 2012 నాటి తీర్పును సవరించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆప్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సంజయ్, మోడీ దేశం కోసం కాకుండా తన స్నేహితుల కోసం పనిచేస్తున్నారు. వారిలో ఒకరికి విద్యుత్, నీరు, రోడ్లు, స్టీల్, ఓడరేవులు, బొగ్గు, గ్యాస్, విమానాశ్రయాలతో సహా దేశం మొత్తాన్ని ఆయన ఇచ్చాడని అన్నారు.

2012లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది, స్పెక్ట్రమ్ లైసెన్సులను తప్పనిసరిగా వేలం వేయాలి, 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' విధానం ఆధారంగా ఇవ్వకూడదని పేర్కొంటూ, ఈ విధానానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్పింది. కానీ మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో పాటు పరిపాలనా ప్రక్రియ ద్వారా స్పెక్ట్రమ్ లైసెన్సులను మంజూరు చేసే విధానాన్ని పార్లమెంటులో ఆమోదించారని కేంద్ర ప్రభుత్వంపై ఆప్ ఎంపీ మండిపడ్డారు.

ఇంతకుముందు జనవరి 2008లో ఎ రాజా టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో వివిధ సంస్థలకు 2G స్పెక్ట్రమ్ లైసెన్సు కేటాయింపులను ఫిబ్రవరి 2, 2012న సుప్రీంకోర్టు రద్దు చేసింది. సహజ వనరులను బదిలీ చేసేటప్పుడు వేలం మార్గాన్ని అనుసరించాలని కోర్టు పేర్కొంది. తాజాగా కేంద్రం ఈ తీర్పును సవరించాలని కోర్టును కోరింది.



Next Story

Most Viewed