కెనడా హైకమిషనర్‌కు భారత్ నోటీసులు

by Disha Web Desk 10 |
కెనడా హైకమిషనర్‌కు భారత్ నోటీసులు
X

న్యూయార్క్: కెనడాలోని భారత దౌత్యకార్యాలయంపై ఖలిస్తానీ వేర్పాటు వాదుల నిరసనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసినట్లు ఆదివారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. పోలీసులు ఉండగా, వేర్పాటువాదుల చర్యలను ఎలా అనుమతించారో చెప్పాలని వివరణ కోరింది. నిరసన తెలిపిన వారిపై యాక్షన్ తీసుకోవాలని గుర్తుచేసింది. కెనడా ప్రభుత్వం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల గాలింపును వ్యతిరేకిస్తూ కెనడాలో నిరసనలు చేపట్టారు. అంతకుముందు యూకే, శాన్ ఫ్రాన్సిస్కోలోనూ నిరసనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు యూఎస్‌లోని భారత ఎంబసీ వద్ద ఖలీస్తానీ మద్ధతుదారులు రెచ్చిపోయారు. భారత మీడియాకు చెందిన యూఎస్‌లోని ప్రతినిధిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని జర్నలిస్టును రక్షించారు.



Next Story

Most Viewed