కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్..! స్వరం మార్చిన మమతా బెనర్జీ

by Disha Web Desk 17 |
కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్..! స్వరం మార్చిన మమతా బెనర్జీ
X

కోల్‌కతా: కర్ణాటక ఎన్నికల బంపర్ రిజల్ట్‌ను చూశాక.. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్వరం మార్చారు.వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అయితే ఆమె కొన్ని షరతులు పెట్టారు. బెంగాల్, యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ వంటి చోట్ల బలమైన ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కు దీదీ సూచించారు. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో బలమైన ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ దన్నుగా ఉండాలన్నారు. అలా చేస్తేనే.. దేశంలో కాంగ్రెస్ బలంగా ఉన్న 200 సీట్లలో మద్దతు ఇచ్చేటందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తాయని చెప్పారు.

కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. “ బెంగాల్‌ను తీసుకుందాం.. ఇక్కడ మేము (తృణమూల్) పోరాడాలి. ఢిల్లీలో AAP పోరాడాలి. బీహార్‌లో నితీష్‌జీ, తేజస్వి, కాంగ్రెస్ కలిసి ఉన్నారు. చెన్నైలో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయొచ్చు. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read..

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై.. మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్!



Next Story

Most Viewed