అప్పటి వరకు లోక్ సభకు రాను: స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
అప్పటి వరకు లోక్ సభకు రాను: స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20వ తేదీన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి.దేశంలో సంచలన సృష్టించిన మణిపూర్ మహిళల ఘటన, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ సభలో మాట్లాడకపోవడంతో విపక్షాలు ఏకంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. మరోవైపు కేంద్రం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టడంతో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేశాయి.

ఆ బిల్లుకు వ్యతిరేకంగా సభలో ఆందోళనలకు దిగాయి. ఇలా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు, అధికార పార్టీ ఎంపీల ఆందోళనతో సభలు దద్దరిల్లితున్నాయి. దీంతో లోక్ సభలో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీల తీరు సభ మర్యాదలకు తీవ్ర భంగం కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సభను అడ్డుకుంటున్న ఎంపీల వైఖరిపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ఎంపీ ప్రవర్తన తీరులో మార్పు వచ్చేంత వరకూ సభకు హాజరుకాకుడదని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఇవాళ లోక్ సభ సమావేశాల హాజరుకాలేదు.

Next Story

Most Viewed