అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు..చైనాను కలిపే ప్రధాన రహదారి ధ్వంసం

by Dishanational2 |
అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు..చైనాను కలిపే ప్రధాన రహదారి ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్‌లో హున్లీ, అనిని మధ్య రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి-313పై కొండచరియలు తెగిపడటంతో రోడ్డుపై గుంత ఏర్పడింది. దీంతో చైనా సరిహద్దులోని దిబాంగ్ వ్యాలీ జిల్లాతో కనెక్టివిటీ తెగిపోగా.. ప్రయాణికులకు సైతం తీవ్ర అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డట్టు అధికారులు భావిస్తున్నారు. హైవేను సరిచేయడానికి నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహాయక చర్యలు చేపట్టింది. రహదారి మరమ్మత్తుకు కావాల్సిన వనరులను ఇప్పటికే సమీకరించినట్టు వెల్లడించింది. ఈ ఘటనపై అరుణాచల్ సీఎం ఫెమా ఖండూ స్పందించారు. రహదారి పునరుద్దరణ వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోనే అతిపెద్ద జిల్లా దిబాంగ్ వ్యాలీ. దేశంలోనే అత్యల్ప జనసాంద్రతను కలిగి ఉంటుంది. చైనాతో సరిహద్దును పంచుకుంటుంది.



Next Story

Most Viewed