- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అధికారంలోకి వస్తే ఒక్క దెబ్బతో పేదరికాన్ని తొలగిస్తాం: రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో.. తమ పార్టీ పేదరికంలో ఉన్న కుటుంబం నుంచి ఒక మహిళకు రూ. లక్ష బదిలీ చేయడం ద్వారా 'ఖటాఖట్ ఖటాఖట్'(హిందీ యాస) ద్వారా దేశం నుంచి పేదరికాన్ని తొలగిస్తుందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే ప్రతి ఏటా రూ. లక్ష(నెలకు రూ. 8,500) బదిలీ చేస్తామన్నారు. 'న్యాయ్ పాత్ర ' పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఆర్థిక స్థిరత్వం, ఆదరణ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఇదే సందర్భంలో దేసంలోని రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ అధికార బీజేపీపై విమర్శలు చేశారు. భారత్‌లోని 70 కోట్ల మంది ప్రజల కంటే 22 మంది ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రైతులు ఎంఎస్‌పీని డిమాండ్ చేస్తున్నారు. యువతకు ఉపాధి చాలా అవసరం, మహిళలు ధరలు పెరుగుదల నుంచి ఉపశమనం కోరుతున్నారు. రైతులను ఉగ్రవాదులంటూ ప్రధాని మోడీ కనీస మద్దతు ధర ఇచ్చేందుకు నిరాకరించారు. భారత చరిత్రలో తొలిసారుగా రైతులు పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలు, రైతులు, పేదల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడటం ఇష్టం లేకనే బీజేపీ దృష్టి మళ్లిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్, పీఎం కేర్స్ ఫండ్, అదానీ మెగా స్కామ్ వంటి భారీ కుంభకోణాలకు మోడీ ప్రభుత్వం పాల్పడింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అవినీతిపరులకు 'మోడీ వాషింగ్ మెషిన్' నుంచి క్లీన్ చిట్ లభిస్తోంది. మోడీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం. ప్రధాని మోడీ పర్యవేక్షణలోనే ఈ అవినీతి జరుగుతోందని రాహుల్ గాంధీ తీవ్రారోపణలు చేశారు.