- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్రిపురలో కీలక పరిణామం: ప్రభుత్వంలో చేరిన తిప్ర మోత
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రం త్రిపురలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ అయిన తిప్ర మోత(టీఎంపీ) బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరింది. దీంతో టీఎంపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనిమేష్ డెబ్బర్మ, బృషకేతు దెబ్బర్మలకు త్రివర్గంలో చోటు దక్కింది. వారిద్దరిచే గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గురువారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం మాణిక్ సాహా కూడా హాజరయ్యారు. ఇటీవల కేంద్రంతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది రోజుల తర్వాత టీఎంపీ ప్రభుత్వంలో చేరడం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ముందు అనిమేష్ డెబ్బర్మ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. కాగా, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిప్ర మోత 60 సీట్లకు గాను 13 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అప్పుడు ప్రభుత్వంలో చేరేందుకు నిర్ణయం తీసుకోలేదు.
కాగా, తిప్రమోత పార్టీని 2021 ఫిబ్రవరి 5వ తేదీన ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ స్థాపించారు. ఈ పార్టీని స్థాపించక ముందు ఆయన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ గా పని చేశారు. పార్టీతో విభేదాలు తలెత్తడంతో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. గ్రేటర్ తిప్రలాండ్, గిరిజనులకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వంటివి పార్టీ లక్ష్యంగా ఉన్నాయి. 2023 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆ పార్టీ 19.69 శాతం ఓట్లను సాధించింది. ఈ నెల 2న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం మాణిక్ సాహా, టీఎంపీ పార్టీల సమక్షంలో త్రిపుర ప్రభుత్వంతో త్రై పాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం..గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని నియమించడం, ఉమ్మడి కార్యాచరణ రూపొందించి వాటిని అమలు చేయడం వంటివి ఉన్నాయి.