- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దుమారం! ఈసీ చర్యలు తీసుకోవాలని కపిల్ సిబల్ డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ ‘‘తల్లుల్లారా, సోదరీమణుల్లారా.. మీ మంగళసూత్రాన్ని కూడా వాళ్లు వదలరు.. ఇది అర్బన్ నక్సలైట్ల బుద్ధి. మీ డబ్బంతా చొరబాటుదారులకు పంపిణీ చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటు దారులకు వెళ్లాలా? మీరు దీన్ని ఆమోదిస్తారా? మీరు కష్టపడి సంపాదించిన మీ ఆస్తిని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? తల్లిదండ్రుల దగ్గరున్న బంగారం చూపించడానికి కాదు. అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినది. వారి విలువ మంగళసూత్రం బంగారంలో లేదా దాని ధరలో లేదు. అది ఆమె జీవితంలోని కలలకు సంబంధించింది. మీరు దానిని లాక్కోవడం గురించి మాట్లాడుతున్నారా?" అని మోడీ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీకి వ్యాఖ్యలపై వెంటనే ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయాలని కపిల్ సిబల్ కోరారు. ప్రధాని నుంచి ఇలాంటి మాటలు తప్ప.. ఇంకేమీ ఆశిస్తాం. కానీ దేశం పట్ల బాధగా ఉందని తెలిపారు. మరోవైపు మోడీ ప్రసంగాన్ని నిజమని నిరూపిస్తూ బీజేపీ.. డిసెంబర్ 2006లోని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 22 సెకన్ల ప్రసంగాన్ని పోస్ట్ చేసింది. “కాంగ్రెస్ వారి స్వంత ప్రధానమంత్రిని నమ్మలేదా?" అని బీజేపీ పేర్కొంది.