మరాఠా రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష: మనోజ్ జారంగే

by Dishanational1 |
మరాఠా రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష: మనోజ్ జారంగే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 5వ తేదీ నుంచి ఆందోళన, నిరాహార దీక్ష చేస్తామని మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే హెచ్చరించారు. ఈ అంశాన్ని నిర్దేశించిన సమయానికి పరిష్కరించాలని ఆదివారం మీడియాతో మాట్లాడిన సమయంలో మనోజ్ జారంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 'రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తప్పుదారి పట్టించింది. మహాయుతి ప్రభుత్వం రిజర్వేషన్లు ఇంకా ఇవ్వలేదు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా మరాఠా రిజర్వేషన్లపై చేసిందేమీ లేదని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలను ఏడు నెలల పాటు వాయిదా వేయడం ద్వారా మరాఠా సమాజానికి ద్రోహం చేశారంటూ మహాయుతి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అంశంపై స్పందించిన మనోజ్ జారంగే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. జూన్ 6వ తేదీలోగా రిజర్వేషన్లు కల్పించకుంటే మరాఠా కమ్యూనిటీ సభ్యులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు.



Next Story

Most Viewed