నేతాజీకి ఏమైందో నేటికీ తెలియకపోవడం సిగ్గుచేటు: మమతా బెనర్జీ

by Dishanational2 |
నేతాజీకి ఏమైందో నేటికీ తెలియకపోవడం సిగ్గుచేటు: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఏమైందో నేటికీ తెలియకపోవడం దేశానికే సిగ్గుచేటని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా ఆమె మంగళవారం కోల్ కతాలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ ప్రకటనల కోసం సెలవులు ప్రకటిస్తున్న ప్రభుత్వం.. పోరాట యోధులను మాత్రం విస్మరిస్తుందని తెలిపారు. నేతాజీకి ఏం జరిగిందో గుర్తించలేక పోవడం బాధాకరమన్నారు. ‘అధికారంలోకి రాకముందు నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మర్చిపోయింది’ అని విమర్శించారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా నిర్వహించాలని ప్రయత్నించి విఫలమయ్యాననని నన్ను క్షమించాలని కోరారు. మరో వైపు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ములు కూడా నేతాజీకి నివాళులర్పించారు.


Next Story