మళ్లీ బద్దలైన ఇండోనేషియా అగ్నిపర్వతం!

by Disha Web Desk 17 |
మళ్లీ బద్దలైన ఇండోనేషియా అగ్నిపర్వతం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఇండోనేషియాలో సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం బద్దలైన సంగతి తెలిసిందే. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి వారిని సురక్షిత స్థలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో శాంతించింది అనుకున్న అగ్నిపర్వతం తిరిగి శుక్రవారం బద్దలైందని అక్కడి స్థానిక అధికారులు, ఒక జర్నలిస్ట్ చెప్పారు. ఇప్పటికే దాని నుంచి బయటకు వస్తున్న పొగ, బూడిద స్థానిక ప్రాంతాలను పూర్తిగా కమ్మేసింది. లావా పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో ప్రజలు దాదాపు 6.కి.మీ దూరానికి పైగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు.

గత కొద్ది రోజులతో పోలిస్తే శుక్రవారం నాటికి అగ్నిపర్వత ప్రభావం కొంత వరకు తగ్గిందని అధికారులు చెప్పారు. అయినప్పటికి నాలుగు-అంచెల వ్యవస్థ అత్యధిక హెచ్చరిక స్థాయిని ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ రోజు మళ్లీ బూడిద ఎక్కువగా వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, పర్వతం మళ్లీ విస్ఫోటనం చెందింది అని పొరుగున ఉన్న తగులాండాంగ్ ద్వీపంలో నివసించే 30 ఏళ్ల రికో అన్నారు. విస్ఫోటనం కారణంగా శిఖరం నుండి 400 మీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయని ఆ దేశ అగ్నిపర్వతాల ఏజెన్సీ తెలిపింది. దాదాపు 20,000 మంది ప్రజలు నివసించే రువాంగ్, తగులాండాంగ్ రెండింటిలోనూ గురువారం కమ్యూనికేషన్‌లు ఇప్పటికే దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వీటిని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Next Story

Most Viewed